ఉపాధ్యాయులుగా మారిన విద్యార్థులు

ఉపాధ్యాయులుగా మారిన విద్యార్థులు

NGKL: ఊర్కొండ మండలం ఊర్కొండపేట ప్రాథమిక పాఠశాలలో శనివారం 'స్వయం పరిపాలన' వేడుకను ఘనంగా నిర్వహించారు. విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలను పెంపొందించేందుకు ఉపాధ్యాయులు ఈ అవకాశాన్ని కల్పించగా, విద్యార్థులు టీచర్లుగా మారి తోటి పిల్లలకు పాఠాలు బోధించారు. ఏటా నిర్వహించే ఈ సంప్రదాయం విద్యార్థుల్లో ఎంతో ఉత్సాహాన్ని నింపిందని ప్రధానోపాధ్యాయులు పేర్కొన్నారు.