ఆటో డ్రైవర్లకు సీఐ సూచనలు
NLR : బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలోని ఆటో డ్రైవర్లతో శనివారం రాత్రి సీఐ శ్రీనివాసరావు సమావేశం అయ్యారు. ఆటో డ్రైవర్లకు పలు సూచనలు చేశారు. రోడ్లపై ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా ఆటోలను నిలుపుకోవాలని సూచించారు. ఆటోకి సంబంధించిన పత్రాలను ఫుల్ ఫోర్సులో ఉంచుకోవాలన్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.