సమ్మక్క సారక్క జాతరకు ముస్తాబైన భీమేశ్వరాలయం
SRCL: సమ్మక్క సారలమ్మ జాతర సందర్భంగా వేములవాడలోని శ్రీరాజరాజేశ్వరస్వామి దేవస్థానానికి అనుబంధ ఆలయాలు విద్యుత్ దీపాలతో సర్వాంగసుందరంగా ముస్తాబయ్యాయి. శ్రీభీమేశ్వరస్వామి, శ్రీబద్ది పోచమ్మ, శ్రీనాగేశ్వరస్వామి ఆలయాలతో పాటు పరిసర ప్రాంతాలను ప్రత్యేక అలంకరణలతో తీర్చిదిద్దారు. దీంతో ఆలయ ప్రాంగణం పండుగ శోభతో కళకళలాడుతోంది.