ఉచిత వైద్యశిబిరాన్ని ప్రారంభించిన BRS నేత

NLG : BRS రాష్ట్ర నాయకులు నేనావత్ కిషన్ నాయక్ ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. శనివారం దేవరకొండ మండలం గన్యానాయక్ తండాలో BRS నాయకుల ఆర్థిక సహకారంతో లయన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో ఈ మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కిషన్ నాయక్ మాట్లాడుతూ.. ఈ ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ప్రతీ ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.