నేడు డయల్ యువర్ డీఎం కార్యక్రమం
RR: మియాపూర్-1 డిపో పరిధిలో ప్రయాణికుల సమస్యల పరిష్కారానికి ఈరోజు డయల్ యువర్ డీఎం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు డిపో మేనేజర్ మోహన్ రావు తెలిపారు. డిపో నుంచి సూపర్ లగ్జరీ, రాజధాని, లహరి బస్సుల్లో ప్రయాణించే ప్రయాణికులు సమస్యలు, సూచనలు, సలహాలు ఇవ్వాలన్నారు. ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు 9959226153 నెంబర్‌కు ఫోన్ చేయాలన్నారు.