VIDEO: ప్రారంభోత్సవానికి నోచుకోని సచివాలయాలు
NDL: రాష్ట్రంలో గతంలో ఉన్న YCP ప్రభుత్వం ప్రతి గ్రామానికి సచివాలయం నిర్మించాలని 40 లక్షల రూపాయలు ఖర్చు చేసింది. అయితే నందికొట్కూరు మండలంలో 10 సచివాలయాలు, మిడుతూరు మండలంలో 15, పగిడాల మండలంలో 3, జూపాడుబంగ్లాలో 5 సచివాలయాలు నిర్మాణాలు పూర్తయినా ప్రారంభోత్సవానికి నోచుకోలేదు. కొన్ని గ్రామాలలో 80 శాతం పనులు పూర్తయినా పట్టించుకోవడం లేదని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.