వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించిన వైసీపీ శ్రేణులు

కోనసీమ: అల్లవరం మండలం బోడసకుర్రు పల్లెపాలెం గ్రామంలో వరద ప్రవాహం ఎక్కువ అవడంతో శుక్రవారం మధ్యాహ్నం అమలాపురం నియోజకవర్గ కో-ఆర్డినేటర్ డా. పినిపే శ్రీకాంత్ స్థానిక వైసీపీ శ్రేణులతో కలిసి పరిశీలించారు. అక్కడ వరద వల్ల ఇబ్బందులు పడుతున్న ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం వరద బాధితులకు వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని కోరారు.