నవాబుపేటలో కాంగ్రెస్ పార్టీలోకి భారీగా చేరికలు
MBNR: నవాబుపేట మండల కేంద్రంలో శుక్రవారం కాంగ్రెస్ పార్టీలోకి వివిధ పార్టీలకు చెందిన నాయకులు మాజీ DCC ఉపాధ్యక్షులు దుష్యంత్ రెడ్డి సమక్షంలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ద్వారానే సంక్షేమం సాధ్యమవుతుందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్యం ఆరు గ్యారంటీల హామీలను అమలు చేస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, తదితరులు పాల్గొన్నారు.