కుమ్మరవాడిలో రెండు ద్విచక్ర వాహనాలు ఢీ

కుమ్మరవాడిలో రెండు ద్విచక్ర వాహనాలు ఢీ

మహబూబ్‌నగర్: పట్టణంలోని కుమ్మరవాడిలో అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రెండు ద్విచక్ర వాహనాలు అతివేగంగా ఢీకొనడంతో బైక్‌పై ఉన్న ఇద్దరికీ తీవ్ర గాయాలు కాగా మరో బైక్‌పై ఉన్న ఒకరికి స్వల్ప గాయాలు అయ్యాయి. స్థానికులు 108కి సమాచారం మంది ఇవ్వడంతో వారిని మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి చికిత్స కోసం తరలించారు.