పుట్టిన రోజే అంత్యక్రియలు

MDK: ఆరేళ్ల బాలుడి పుట్టిన రోజు వేడుకలకు బదులుగా అంత్యక్రియలు జరిగాయి. వివరాలు.. చిలిపిచేడ్ మండలం చిట్కుల్‌కు చెందిన కొండారెడ్డిగారి దిలీప్ రెడ్డి, చందనల కుమారుడు నవీన రెడ్డి(6) పుట్టిన రోజు ఆదివారం ఉండగా వేడుకల కోసం కేరళలోని వయనాడ్‌కు వెళ్లారు. అక్కడ ప్రమాదవశాత్తు స్విమ్మింగ్ ఫూల్లో పడి బాలుడు మృతి చెందాడు.