రౌడీషీటర్లకు కౌన్సెలింగ్ ఇచ్చిన ఎస్సై
ELR: జీలుగుమిల్లి ఎస్సై క్రాంతి కుమార్ రౌడీషీటర్లను పోలీస్ స్టేషన్‌కు పిలిపించి ప్రత్యేక కౌన్సెలింగ్ నిర్వహించారు. భవిష్యత్తులో ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు లేదా క్రిమినల్ కేసుల్లో పాల్గొంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. వారి సత్ప్రవర్తన కోసం బైండ్ ఓవర్ చేసి ఎమ్మార్వో కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ఈ చర్యలు చేపట్టినట్లు తెలిపారు.