సిల్వరెస్ట్ వాసులకు కోర్టులో ఊరట

సిల్వరెస్ట్ వాసులకు కోర్టులో ఊరట

మేడ్చల్: కాప్రా డివిజన్ ఎల్లారెడ్డిగూడలోని జనప్రియ సిల్వరెస్ట్ వాసుల డ్రైనేజీ సమస్యకు కోర్టు పరిష్కారం చూపింది. గత మూడు సంవత్సరాలుగా సరిహద్దులోని ఎన్రైవ్ నుంచి డ్రైనేజీ పారుతూ 800 మందిని ఇబ్బంది పెడుతోంది. అధికారుల నిర్లక్ష్యంపై హైకోర్టు న్యాయవాది సుంకర నరేష్ హైకోర్టులో కేసు వేయడంతో, రెండు వారాలలోపు కొత్త డ్రైనేజీ నిర్మించాలని కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.