లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

కృష్ణా: యనమలకుదురు గ్రామం డొంక రోడ్డులో ఎమ్మెల్యే బోడె ప్రసాద్ లబ్ధిదారులకు నూతనంగా మంజూరైన పింఛన్‌లను సోమవారం పంపిణీ చేశారు. లబ్ధిదారులకు ప్రభుత్వం అందిస్తున్న పింఛన్‌లు వారి జీవన భద్రతకు దోహదపడాలని ఆకాంక్షిస్తూ, భవిష్యత్తులో మరిన్ని సేవలు అందించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు, అధికారులు పాల్గొన్నారు.