జూనియర్ హాకీ ప్రపంచకప్‌లో భారత్ ఓటమి
జూనియర్ హాకీ ప్రపంచకప్‌లో సెమీఫైనల్‌లో భారత పురుషుల జట్టు ఓటమిపాలైంది. క్వార్టర్ ఫైనల్లో బెల్జియంపై విజయం సాధించి సెమీస్‌కు చేరుకున్న భారత్, అక్కడ బలమైన జర్మనీతో జరిగిన మ్యాచ్‌లో 1-5 తేడాతో పరాజయం పాలైంది. దీంతో మూడో స్థానం కోసం జరిగే మ్యాచ్‌లో అర్జెంటీనాతో భారత్ పోటీపడనుంది. ఫైనల్‌లో జర్మనీ, స్పెయిన్ జట్లు తలపడనున్నాయి.