ఆ ఘనత వైఎస్ జగన్‌దే: విడదల రజిని
AP: మహిళా రిజర్వేషన్ బిల్లుతో దేశ భవిష్యత్తు మారబోతుందని మాజీమంత్రి విడదల రజిని అన్నారు. ఇవాళ దేశ చరిత్రలో గొప్పరోజుగా మిగిలిపోతుందని తెలిపారు. 'మహిళల అభివృద్ధి గురించి ఆలోచించిన గొప్ప నాయకుడు జగన్. మహిళలను హోం మినిస్టర్లగా, డిప్యూటీ సీఎంలుగా చేసిన ఘనత జగనన్నదే. మహిళా సాధికారతకు అనేక కార్యక్రమాలు చేపట్టింది జగనే' అని పేర్కొన్నారు.