VIDEO: 'మెరుగైన వైద్య సేవలు అందిస్తన్న మంత్రికి కృతజ్ఞతలు'
KNR: జిల్లా బీజేపీ అద్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి స్థానిక నాయకులతో కలిసి హుజూరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిని సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ చొరవ తీసుకుని ఆసుపత్రికి సుమారు కోటిన్నర రూపాయల ఆధునిక వైద్య పరికరాలు అందజేశారన్నారు. పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవల అందించడం పట్ల మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.