గోరంట్లలో కోటి సంతకాల సేకరణ

గోరంట్లలో కోటి సంతకాల సేకరణ

సత్యసాయి: గోరంట్లలో మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ పంచాయతీరాజ్‌ జిల్లా విభాగం అధ్యక్షుడు రాజారెడ్డి ఆధ్వర్యంలో బుధవారం కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. రాజారెడ్డి మాట్లాడుతూ.. మెడికల్‌ కాలేజీలు ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నడపాలని డిమాండ్ చేశారు. ప్రైవేటీకరణ వల్ల పేదలకు వైద్య విద్య దూరం అవుతుందని తెలిపారు.