సీఎంపై కాంగ్రెస్ సంచలన ఆరోపణలు
అసోం సీఎం హిమంత బిశ్వ శర్మపై కాంగ్రెస్ సంచలన ఆరోపణలు చేసింది. సీఎం భార్య రినికి శర్మకు మూడు దేశాల పాస్‌పోర్టులు ఉన్నాయని పేర్కొంది. అంతేకాకుండా దుబాయ్, అమెరికాలో భారీగా అక్రమ ఆస్తులు ఉన్నాయని మండిపడింది. భారత్‌లో ద్వంద్వ పౌరసత్వానికి అనుమతి లేనప్పుడు ఇదెలా సాధ్యమవుతుందని నిలదీసింది. ఎన్నికల అఫిడవిట్‌లో విదేశీ ఆస్తుల వివరాలను సీఎం ఎందుకు దాచారని ప్రశ్నించింది.