విజయవాడలో బెల్ట్ దుకాణాలు జోరు

NTR: విజయవాడలో బెల్ట్ దుకాణాల జోరుకు అడ్డే లేకుండా పోయింది. జాతీయ రహదారిని అనుకుని ఉన్న రామవరప్పాడు, ప్రసాదంపాడు, ఎనికేపాడు, నిడమానూరు, గూడవల్లి గ్రామాల్లో మద్యం వ్యాపారులు సిండికెట్‌గా ఏర్పడి పగలు రాత్రి అనే తేడా లేకుండా అమ్మకాలు సాగిస్తున్న ఎక్సైజ్, పోలీసు అధికారులు కన్నెత్తి చూడట్లేదని విమర్శలు వినిపిస్తున్నాయి.