సఖినేటిపల్లి పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన డీఐజీ

సఖినేటిపల్లి పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన డీఐజీ

కోనసీమ: ఏలూరు రేంజ్ డీఐజీ అశోక్ కుమార్ బుధవారం సఖినేటిపల్లి పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించిన ఆయన స్టేషన్ పరిధిలో భార్యాభర్తల తగాదాలు, నకిలీ గల్ఫ్ ఏజెంట్ల బాధితుల కేసులు అధికంగా నమోదవుతున్నాయని, వీటిపై ప్రత్యేక దృష్టి సారించాలని సిబ్బందికి ఆదేశాలు ఇచ్చినట్లు మీడియాకు తెలిపారు.