ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పించాలి: మాజీ మంత్రి
NLR: మనుబోలు మండలంలో పర్యటించిన మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ధాన్యానికి మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. కూటమి పాలనలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విమర్శించారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరకు ధాన్యం కొనుగోలు చేయకుండా వ్యాపారులు తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.