విషాదంలోనూ వికసించిన మానవత్వం
MDCL: పీర్జాదిగూడకు చెందిన ముత్తులూరు కృష్ణకుమారి(58), నల్గొండకు చెందిన రైతు పల్లపు ప్రశాంత్ (27) బ్రెయిన్ డెడ్ కావడంతో వారి కుటుంబ సభ్యులు అవయవదానానికి ముందుకొచ్చారు. వీరి గొప్పనిర్ణయం వల్ల కిడ్నీలు, లివర్, గుండె, కళ్ళ రూపంలో మొత్తం 9 మందికి పునర్జన్మ లభించింది. వీరు చూపిన తెగువ, త్యాగం భావితరస్ఫూర్త దాయకమని వైద్యులు తెలిపారు.