మహిళలు పురుషులతో సమానంగా రాణించాలి: ఎమ్మెల్యే

మహిళలు పురుషులతో సమానంగా రాణించాలి: ఎమ్మెల్యే

WGL: నెక్కొండ మండలం దీక్షకుంట గ్రామంలో ఆదివారం జ్యూట్ బ్యాగుల తయారీ శిక్షణ ముగింపు కార్యక్రమంలో నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి పాల్గొన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రభుత్వ సంక్షేమ పథకాలను మహిళలు సద్వినియోగం చేసుకొని పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో రాణించాలని ఆకాంక్షించారు. గ్రామాల్లో మహిళా సంఘాల బలోపేతం అవసరమని ఆయన తెలిపారు.