చేనేత కార్మికులను సన్మానించిన నేతలు

WGL: జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా నర్సంపేటలో చేనేత కార్మికులకు బుధవారం సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. చేనేత ఐక్యవేదిక రాష్ట్ర నాయకులు మాట్లాడుతూ... చేనేత కార్మికుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించి వారిని ఆదుకోవాలని కోరారు. నేతలు రాపోలు వీర మోహన్, పెండం శివానంద్, మాజీ ఎంపీపీ బాషాని చంద్రప్రకాష్ పాల్గొన్నారు.