కొమరాడలో ఏనుగుల సంచారం కలకలం

కొమరాడలో ఏనుగుల సంచారం కలకలం

PPM: కొమరాడ మండలంలోని గంగరేగువలస గ్రామ పరిసరాల్లో ఏనుగుల గుంపు సంచరిస్తోందని అటవీ శాఖ మంగళవారం తెలిపింది. రైతులు, గ్రామస్థులు జాగ్రత్తగా ఉండాలని, ఏనుగులను కవ్వించవద్దని సూచించారు. చేతికందిన పంటలను ఏనుగులు ధ్వంసం చేస్తున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తూ, వాటిని ఇతర ప్రాంతాలకు తరలించాలని కోరుతున్నారు.