భక్తుల మృతి నన్ను తీవ్రంగా కలిచివేసింది: అర్వింద్

NZB: తిరుపతిలో వైకుంఠ ఏకాదశి సర్వదర్శన టీకెట్స్ జారీలో తొక్కిసలాటలో భక్తులు మరణించిన ఘటనపై NZB ఎంపీ అర్వింద్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తోపులాటలో భక్తులు మృతి చెందడం తనను తీవ్రంగా కలిచివేసిందని, మృతి చెందిన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడ్డ వారు త్వరగా కోలుకోవాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నట్లు 'X' వేదికగా పేర్కొన్నారు.