పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి

WGL: వెంకటాపురం మండలంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బుధవారం పర్యటించి, పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దుర్గతంలో ఉన్నా పేదల సంక్షేమమే లక్ష్యంగా ఇందిరమ్మ ఇండ్లు, సన్న బియ్యం, ఉద్యోగాలు అందిస్తున్నామని అన్నారు. ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, కలెక్టర్ దివాకర్ తదితరులు పాల్గొన్నారు.