భక్తి శ్రద్ధలతో శ్రీ నందీశ్వరాలయ మండల పూజ
KDP: వేంపల్లె మండలంలోని నందిపల్లె గ్రామంలో రూ.6 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మించిన శ్రీ నందీశ్వరాలయంలో ఆదివారం భక్తి శ్రద్ధలతో మండల పూజ నిర్వహించామని ఆలయ ఛైర్మన్ శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. అర్చకులు బద్రి స్వామి నేతృత్వంలో అర్చక స్వాములు సాయి, కృష్ణ శర్మ స్వాములచే వేద మంత్రోచ్చారణతో మహాశాంతి అభిషేకం, జలాభిషేక తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం తీర్థప్రసాదాలను పంపిణీ చేశారు.