VIDEO: శ్రీ సీతారామచంద్రస్వామి అశ్వాహనపై శోభాయాత్ర
KNR: ఇల్లందకుంట శ్రీ సీతారామచంద్రస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సూర్యరథం సందర్భంగా చిన్నారులు స్వామివారి వేషధారణలో అశ్వ వాహనంపై శోభాయాత్రను వైభవంగా నిర్వహించారు. సీత, రామ, లక్ష్మణ వేషాలతో పాటు హనుమంతుడు సేవ చేస్తున్నట్లు అలంకరించుకుని భక్తులకు దర్శనమిచ్చారు. బండ్ల జాతరలో రాముని పాటలకు చిన్నారులు భరతనాట్యం ప్రదర్శించి భక్తులను ఆకట్టుకున్నారు.