'దందాలకు పాల్పడితే సహించేది లేదు'
KNR: తన పేరు చెప్పి అక్రమ దందాలు, కబ్జాలకు పాల్పడితే తీవ్ర పరిణామాలు ఉంటాయని కేంద్ర మంత్రి బండి సంజయ్ హెచ్చరించారు. ఎవరైనా తన పేరుతో సెటిల్‌మెంట్లు చేస్తూ ఇబ్బంది పెడితే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని ప్రజలకు సూచించారు. పైరవీకారుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఏదైనా అనుమానం వస్తే వెంటనే ఎంపీ కార్యాలయ సిబ్బందికి సమాచారం అందించాలని ఆయన స్పష్టం చేశారు.