మ్యాజిక్ డ్రెయిన్ నిర్మాణానికి శంకుస్థాపన

SKLM: మెళియాపుట్టి మండలం కోసమల గ్రామంలో గురువారం మ్యాజిక్ డ్రెయిన్ స్థలానికి ఎంపీడీవో నరసింహ ప్రసాద్ పండా శంకుస్థాపన చేశారు. దీని అంచనా విలువ సుమారు 100 మీటర్లకు రూ.90,000లు ఖర్చు అవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ నాయకులు నంబాల వెంకట్రావు, భాస్కర్ గౌడ్, బొచ్చు వనజాక్షి, అధికారులు, కార్యకర్తలు పాల్గొన్నారు.