VIDEO: ఏనుమాముల మార్కెట్‌లో రైతుల ఆందోళన
WGL: ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ యార్డ్ మొక్కజొన్న దిగుబడితో కిక్కిరిసిపోయింది. కొనుగోళ్లు ప్రారంభం కాకపోవడంతో రైతులు గత 10 రోజులుగా పంటను విక్రయించలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పంటను అమ్మేందుకు రోజులు తరబడి వేచి చూడాల్సి వస్తోందని వాపోతున్నారు. అధికారులు చర్యలు తీసుకుని కొనుగోళ్లు ప్రారంభించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. దీంతో మార్కెట్‌లో ఉద్రిక్త చోటుసుకుంది.