48 గంటల తర్వాత విధ్వంసమే: ట్రంప్

48 గంటల తర్వాత విధ్వంసమే: ట్రంప్

ఇరాన్‌కు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. తమతో ఒప్పందం చేసుకోవడానికి.. హర్మూజ్ జలసంధిని తెరవడానికి ఇరాన్‌కు ఇచ్చిన 10 రోజుల గడువు దగ్గర పడిందని తెలిపారు. తాను విధించిన గడువుకు మరో రెండు రోజులే మిగిలి ఉందన్నారు. 'సమయం మించిపోతోంది.. వారిపై ప్రళయం విరుచుకుపడటానికి ఇంకా 48 గంటలే మిగిలి ఉన్నాయి' అని పేర్కొన్నారు.