ఈ నెల 8న ములుగులో ఈటల ప్రచారం
MLG: జిల్లాలో ఈ నెల 8న బీజేపీ నాయకుడు, మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఈ మేరకు ములుగు మున్సిపాలిటీలో 20 మంది బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహించి, రోడ్ షోలో పాల్గొననున్నారు.