'పోలవరం ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేయాలి'

'పోలవరం ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేయాలి'

ELR: పోలవరం నియోజకవర్గాన్ని ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేయాలని ఆదివాసి సంక్షేమ పరిషత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీను ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుట్టాయగూడెంలో గురువారం జరిగిన పరిషత్ జిల్లా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాల విభజన సమయంలో ఆదివాసీల అభిప్రాయ సేకరణ చేయకుండా ప్రభుత్వాలు ఒంటెద్దు పోకడ పోతున్నాయని విమర్శించారు.