పురపాలక సంఘం ప్రత్యేక అధికారిగా రామకృష్ణారెడ్డి బాధ్యతలు

పురపాలక సంఘం ప్రత్యేక అధికారిగా రామకృష్ణారెడ్డి బాధ్యతలు

అనంతపురం: రాయదుర్గం పురపాలక సంఘం ప్రత్యేక అధికారిగా రామకృష్ణారెడ్డి బుధవారం బాధ్యతలు చేపట్టారు. పాలకవర్గ పదవీకాలం ముగియడంతో ప్రభుత్వం ఈయనను నియమించింది. ఫారెస్ట్ సెటిల్మెంట్ ఆఫీసర్‌గా ఉన్న రామకృష్ణారెడ్డి నేటి నుంచి రాయదుర్గం మున్సిపల్ వ్యవహారాలను పర్యవేక్షిస్తారు. మున్సిపల్ కమిషనర్ దివాకర్ రెడ్డి, తహశీల్దార్ హరికుమార్ ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు.