నిడమనూరులో అకాల వర్షం
NLG: నిడమనూరు మండల వ్యాప్తంగా ఆదివారం సాయంత్రం ఈదురుగాలులతో కూడిన అకాల వర్షం కురిసింది. సుమారు అరగంట పాటు కురిసిన వర్షానికి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోని రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. నిడమనూరు మార్కెట్ యార్డులోని దొడ్డు రకం ధాన్యం, సాయి విగ్రహం వద్ద ఉన్న సన్న రకం ధాన్యం రాసులను కాపాడుకునేందుకు రైతులు నానా తంటాలు పడ్డారు.