డిపోలకే పరిమితమైన బస్సులు
JGL: ప్రభుత్వంతో ఆర్టీసీ కార్మికుల చర్చలు విఫలం కావడంతో మంగళవారం అర్ధరాత్రి నుంచి సమ్మెకి దిగారు. ఆర్టీసీ సమ్మెలో భాగంగా జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లి డిపోల ఎదుట ఆర్టీసీ కార్మికులు ధర్నా నిర్వహించి తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. దీంతో బస్సులన్నీ డిపోలకే పరిమితం కావడంతో బస్టాండ్లలో ప్రయాణికులు బస్సులు లేక నిరీక్షించాల్సి వస్తుంది.