భీమిలి పాలిటెక్నిక్ కళాశాలలో స్పాట్ అడ్మిషన్లు

విశాఖ: భీమిలి ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో మిగులు సీట్ల భర్తీకి మంగళవారం స్పాట్ అడ్మిషన్లు నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ మురళీ కృష్ణ తెలిపారు. పదవ తరగతి పాసై, పాలిసెట్-2025 రాయకపోయినా అర్హులని పేర్కొన్నారు. ఆసక్తి గల విద్యార్థినులు సంబంధిత సర్టిఫికెట్లతో ఉదయం 9:30 గంటలకు కళాశాలకు హాజరుకావాలని సూచించారు.