పి-4 కార్యక్రమంతో బంగారు కుటుంబాలను గుర్తించాం: కలెక్టర్

పి-4 కార్యక్రమంతో బంగారు కుటుంబాలను గుర్తించాం: కలెక్టర్

నంద్యాల: జిల్లాలో పేదరిక నిర్మూలన లక్ష్యంగా అమలు చేస్తున్న పి-4 కార్యక్రమాన్ని సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లాలని కలెక్టర్ రాజకుమారి అధికారులను ఆదేశించారు. నంద్యాల కలెక్టరేట్‌లో నిర్వహించిన సమావేశంలో ఈ కార్యక్రమం పురోగతిపై చర్చించారు. ఇప్పటివరకు జిల్లాలో పేదరికంతో బాధపడుతున్న 50,038 బంగారు కుటుంబాలను గుర్తించినట్లు కలెక్టర్ వెల్లడించారు.