ధోనికి గాయం.. ఆందోళనలో అభిమానులు

ధోనికి గాయం.. ఆందోళనలో అభిమానులు

మార్చి 28 నుంచి ఐపీఎల్ సీజన్ ప్రారంభం కానుంది. అయితే సీఎస్‌కే అభిమానులకు బిగ్ షాక్ తగిలింది. ప్రాక్టీస్ సెషన్ అనంతరం ధోని కుంటుతూ నడుస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై ఫ్రాంచైజీ నుంచి అధికారిక ప్రకటన రాకపోయినా.. అతని ఫిట్‌నెస్‌పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సీజన్ ఆడతాడా? లేదా? అని అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.