కాళంగి డ్యామ్ ఓపెన్.. ప్రజలకు సీఐ హెచ్చరిక
TPT: KVB పురం (M) రాయలచెరువుకు గండిపడటంతో నీరు కాళంగి డ్యామ్ వైపు పరుగులు పెడుతోంది. దీంతో రిజర్వాయర్ నుంచి నీటిని విడుదల చేశారు. నది పరిసర గ్రామాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూళ్లూరుపేట సీఐ హెచ్చరించారు. అధికారులు పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ప్రజలు ఎలాంటి ప్రమాద ప్రాంతాలకు వెళ్లవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.