ప్రభుత్వం కీలక నిర్ణయం
AP: వికలాంగులకు రిజర్వు చేసిన బ్యాక్‌లాగ్ ఖాళీల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఖాళీల భర్తీకి ప్రత్యేక నియామక డ్రైవ్ చేపట్టాలని అన్ని శాఖలను ఆదేశించింది. ఉద్యోగాల భర్తీపై సీఎం చంద్రబాబు ఆదేశాలలో ఉత్తర్వులు జారీ చేసింది. పోస్టుల భర్తీకి కాలపరిమితి మరో ఏడాది పెంచింది. వచ్చే ఏడాది మార్చి 31 వరకు గడవు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.