6వ వార్డులో అధ్వానంగా తయారైన రోడ్డు

6వ వార్డులో అధ్వానంగా తయారైన రోడ్డు

KMM: మధిర మున్సిపాలిటీ పరిధిలోని 6వ వార్డులో వీధి రోడ్డు అధ్వానంగా తయారైందని స్థానికులు చెప్పారు. కనీసం నడవడానికి కూడా వీలు లేని దుస్థితిలో రహదారులు ఉన్నాయని, అధికారులు చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారని వాపోయారు. దోమలు విపరీతంగా పెరిగి నానా ఇబ్బందులు పడుతున్నామని, అధికారులు వెంటనే స్పందించి సీసీ రోడ్లను మంజూరు చేయాలని కోరారు.