వేసవి తీవ్రత.. పొలీసుల వినూత్న చర్య
హనుమకొండలో వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ట్రాఫిక్ పోలీసులు వినూత్న చర్యలు చేపట్టారు. బుధవారం అశోకా జంక్షన్ సిగ్నల్ వద్ద గ్రీన్ మ్యాట్‌ను ఏర్పాటు చేశారు. సిగ్నల్ వద్ద వేచి ఉండే వాహనదారులు, పాదచారులు-ప్రత్యేకంగా చిన్నపిల్లలు, వృద్ధులు-ఎండ తాపం నుంచి కొంత ఉపశమనం పొందేలా ఈ చర్య తీసుకున్నారు.