సాగులో వినూత్న పద్దతులు అవలంబించాలి

ELR: ఉంగుటూరు మండలం నాచుకుంట, వెల్లమిల్లిలలో సమీకృత వ్యవసాయ విధానాన్ని జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి పరిశీలించారు. సమీకృత వ్యవసాయ విధానాన్ని పాటిస్తున్న పంట పొలాలకు చెందిన రైతులు రత్నాజీ, పరిమి సత్యనారాయణలతో మాట్లాడారు. సమీకృత సాగుతో రైతులు లాభాలు ఆర్జించాలన్నారు. ఒకే పంటకు పరిమితం కాకుండా ఉన్న భూమిలో సమీకృత వ్యవసాయ విధానంలో వీలైనన్ని పంటలు పండించాలన్నారు.