VIDEO: మొగిలీశ్వరస్వామి హుండీ ఆదాయం ఎంతంటే..?
CTR: బంగారుపాళ్యం మండలం మొగిలి గ్రామంలోని శ్రీ కామాక్షి సమేత మొగిలీశ్వరస్వామి దేవస్థానంలో బుధవారం హుండీ లెక్కింపు నిర్వహించారు. 86 రోజులకు హుండీల ద్వారా రూ.7,96,688, అన్నదాన హుండీల ద్వారా రూ.84,597 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో మునిరాజా తెలిపారు.