చౌడేపల్లి మండలంలో ఘనంగా పశువుల పండుగ

చౌడేపల్లి మండలంలో ఘనంగా పశువుల పండుగ

CTR: చౌడేపల్లి మండలం లద్ధిగం గ్రామంలో పశువుల పండుగను ఘనంగా నిర్వహించారు. శుక్రవారం కనుమ సందర్భంగా గ్రామంలోని రైతులు తమ పశువులను శుభ్రం చేసి వివిధ రకాలుగా అలంకరించి పూజలు నిర్వహించారు. మంగళ వాయిద్యాలు నడుమ గ్రామ వీధుల్లో ఊరేగించారు. దీంతో గ్రామంలో సందడి వాతావరణం నెలకొంది. గ్రామ సమీపాలలో ఏర్పాటు చేసిన చిట్లా కుప్ప వద్దకు వాటిని తీసుకువెళ్లారు.