యాగంటిలో మంత్రి సతీమణి ప్రత్యేక పూజలు

యాగంటిలో మంత్రి సతీమణి ప్రత్యేక పూజలు

NDL: యాగంటి పుణ్యక్షేత్రంలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సతీమణి బీసీ ఇందిరమ్మ శనివారం ప్రత్యేక పూజలు చేశారు. ఈ మేరకు క్షేత్రానికి వచ్చిన ఆమెకు ఈవో పాండురంగారెడ్డి, అర్చకులు స్వాగతం పలికారు. అనంతరం ఉమామహేశ్వర స్వామికి గోపూజ, అర్థనారీశ్వర ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆమెకు అర్చకులు వేద ఆశీర్వచనంతో తీర్థ ప్రసాదాలు అందజేశారు.