VIDEO: ఏడుపాయల అమ్మవారి ప్రత్యేక మంగళహారతి
MDK: పాపన్నపేట మండలం నాగసానుపల్లి గ్రామంలోని ప్రసిద్ధ ఏడుపాయల వన దుర్గాభవాని అమ్మవారికి మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయంలో అర్చకులు అమ్మవారిని అందంగా అలంకరించి అభిషేకాలు, హారతులు చేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.